చీర కట్టులో జిమ్నాస్టిక్స్‌

సాధారణంగా మహిళలు చీర కట్టులో కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడటం కామన్. ముఖ్యంగా క్రీడల్లో అయితే అది మరీ కష్టం. అందులోనూ చీరలో జిమ్నాస్టిక్స్‌  చేయడం సాధ్యం కాదు. కానీ దాన్ని కూడా ఎంతో సాధనతో సుసాధ్యం చేసింది జిమ్నాస్ట్ పారుల్ అరోరా. ఈమె జమ్నాస్టిక్స్ లో నేషనల్ గోల్డ్ మెడల్ సాధించింది.

పారుల్.. చీరలో అతి సునాయాసంగా పల్టీలు కొడుతుడూ జమ్నాస్టిక్ ఫీట్లు చేసింది. ఈ వీడియోను అపర్ణా జైన్ అనే మరో మహిళ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ అవుతోంది. చాలా నేర్పుగా, ఒడుపుగా తన విద్యను ప్రదర్శించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మగువలు తలచు కోవాలేగానీ, సాధ్యం కానిది ఏదీ లేదంటున్నారు నెటిజన్స్.

Latest Updates