విమానంలో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో మెహ్రాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అలర్టైన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని ఆ దేశ అత్యవసర విభాగం అధిపతి తెలిపారు. ఇరాన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఫాకర్‌ 100 విమానంలో ఈ ప్రమాదం జరిగింది. టెక్నికల్ కారణాలతో వెనక ల్యాండింగ్‌ గేర్‌ సరైన సమయంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులోని అంబులెన్సులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

Latest Updates