సీఎం తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని ఆపలేరు

దుబ్బాక : ముఖ్యమంత్రి తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని ఆపలేరన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రతి ఇంటికి రెండు పెన్షన్లియ్యాల్సిందేనన్న ఆయన.. రఘునందన్  గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్ల మీదే ఉంటుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మోతెలో ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. తర్వాత దౌల్తాబాద్ లో జరిగిన గొర్రె కాపరుల సమ్మేళనంలోనూ పాల్గొని మాట్లాడారు.

పాస్ ‌పోర్ట్ ‌ల బ్రోకర్‌ కేసీఆర్‌ అని.. నిరుద్యోగులను ముంచి కోట్లు సంపాదించారన్నారు. కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందినవారని నట్టేట ముంచి కేసీఆర్ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని తెలిపారు. నీచమైన అవినీతిపరుడైన సీఎంను ఎన్నుకున్నందుకు.. దేశమే ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీసీలను రాష్ట్ర సీఎం నట్టేట ముంచుతున్నారని .. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా.. చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తే బీజేపీ అడ్డుకుందని తెలిపారు.

కొండగట్టు బస్సు ప్రమాదంపై కేసీఆర్‌ మాట్లాడలేదన్నారు. హైదరాబాద్‌ లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే.. కేసీఆర్‌ మాత్రం ఫామ్ ‌హౌస్ ‌లో పడుకున్నారన్నారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని, మీరు ఎక్కడైనా మీటర్లు పెడితే మీ సంగతి తేలుస్తామన్నారు బండి సంజయ్.

Latest Updates