ప‌తంజ‌లీకి షాకిచ్చిన కోర్ట్ : క‌రోనిల్ పై ట్రేడ్ మార్క్ వేయోద్దంటూ ఉత్త‌ర్వులు

పతంజ‌లీకి మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్, దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో త‌యారు చేస్తున్న “కరోనిల్ డ్ర‌గ్స్ పై ట్రేడ్ మార్క్ చేయకూడ‌ద‌ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

చెన్నైకి చెందిన అరుద్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ‌మాన్యం మ‌ద్రాస్ హైకోర్ట్ లో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 1993 నుండి కరోనిల్ ట్రేడ్ మార్క్ త‌మ‌దేన‌ని పిటిష‌న్ లో పేర్కొంది.

పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన మ‌ద్రాస్ హైకోర్ట్..పతంజీలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌రోనిల్ టాబ్లెట్ కు క‌రోనా వైర‌స్ త‌గ్గ‌న‌ప్పుడు ఆ టాబ్లెట్ పై ట్రేడ్ మార్క్ ఎందుకు వేస్తార‌ని ప్ర‌శ్నించింది. లాభ‌పేక్ష‌తో క‌రోనా నివార‌ణ పేరుతో ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మద్రాస్ హైకోర్ట్ రూ.10ల‌క్ష‌లు జ‌రిమానా విధించింది.

Latest Updates