కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. పాలమూరు జిల్లా దేవరకద్ర స్థానిక నేతలు TRSలో చేరికల సభలో పాల్గొన్న కేటీఆర్… మొన్ననే చంద్రబాబు వీపు పగలకొట్టి ఆంధ్రాకి పంపించామన్నారు. ముసుగు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబే అన్నారు. ఏపీ ప్రజలే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోలావాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్న అయన… బాబు పోతేనే జాబు వస్తుందని అక్కడి ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్, చంద్రబాబుల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. మమ్మల్ని తిడుతూనే మా పథకాలు కాపీ కొడుతున్నారని, చంద్రబాబులా మనకు కుట్రలు,ముసుగు రాజకీయాలు చేయడం చేతకావన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారన్నారు. చంద్రబాబు ఎవరోకరితో పొత్తులేకుండా బతకలేరన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడన్నారు. మోడీ, రాహుల్‌ గాంధీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. మోడీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందన్న కేటీఆర్.. 16 MP సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడించవచ్చన్నారు.

Latest Updates