వ్యాధితో మనస్థాపం… ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్య

కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాసిక్ సమీపంలోని ఘోటిలోని శ్రీ రామ్ నగర్ చెందిన 48 ఏళ్ల జవహర్ లాల్ రాం కిసన్ గుప్తా శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్ లాల్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో స్థానిక ప్రభుత్వ రిఫరల్ ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాడు. గత వారం రోజులుగా డయాలసిస్ జరుగుతోంది.

అనారోగ్యానికి తోడు ఆర్ధిక పరిస్థితి కూడా సరిగా లేక పోవడంతో మనస్థాపం చెందిన జవహర్ లాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భద్రకాళీ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాసిక్ సమీపంలోని ఘోటిలోని శ్రీరామ్ నగర్ నివాసి అయిన జవహర్లాల్ రామ్కిసాన్ గుప్తా మరణించిన 10.30 గంటలకు తన జీవితాన్ని ముగిసిందని భద్రకాళి పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

Latest Updates