హాస్పిటల్ పెచ్చులూడి పడి పేషెంట్ మృతి

ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ పెచ్చులూడి పడి ఒక పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.

గురువారం నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్ బయట వైపు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ నిల్చుని ఉన్న వారికి గాయాలయ్యాయి. వారిలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్‌గా గుర్తించామని తెలిపారు నాగ్‌పూర్ అడిషనల్ కమిషనర్ బీజీ గైకర్. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు, ఎన్నాళ్ల క్రితం కట్టారన్న వివరాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్, వసతుల కొరత, డాక్టర్ల లేమి, టెస్టులకు ఎక్యూప్‌మెంట్ ఉండదు.. ఇదీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపించే సీన్. ఈ విషయంలో ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేదని నాగ్‌పూర్ హాస్పిటల్ ఘటన మరోసారి రుజువు చేసింది.

Latest Updates