టాన్సిల్స్ ఆపరేషన్.. మహిళ మృతి.. డాక్టర్ పై ఫిర్యాదు

టాన్సిల్స్ తో బాధపడుతున్న మహిళకు ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందింది. ఈ ఘటన కాచిగూడ పోలిస్టేషన్ పరిదితో జరిగింది. సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళకు సర్ది (కోల్డ్) అవడంతో… ఆమె భర్త నవీన్ కుమార్ తో కలిసి కాచీగూడ లోని సీసీ శ్రోఫ్ హాస్పిటల్ లో చెక్ చేయించుకోవడానికి వెళ్లింది. అయితే అక్కడ పేషెంట్స్ ఎక్కువగా ఉండటంతో అదే హస్పిటల్ లో పనిచేస్తున్న ENT డాక్టర్ రామకృష్ణ చైతన్య పురిలోని అతని ప్రైవేట్ హాస్పిటల్ కు రావలసిందిగా చెప్పాడు. చైతన్యపురిలో చెక్ చేయించుకోగా… సర్దితొ టాన్సిల్స్ ఏర్పడ్డాయని… ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు.

ఆపరేషన్ మాత్రం కాచిగూడలోని సీసీ శ్రోఫ్ హాస్పిటల్ లో చేస్తానన్నాడు డాక్టర్ నవీన్ కుమార్. దీంతో గురువారం స్వాతి ఆమె భర్త నవీన్ తో కలిసి శ్రోఫ్ హాస్పిటల్ కు వెళ్లారు. అడ్మిట్ చేసుకున్న హాస్పిటల్ సిబ్బంది.. స్వాతిని ఆపరేషన్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత స్వాతి శరీరం వైద్యానికి సహకరించడంలేదని నవీన్ కు  చెప్పారు.సాయంత్రం ఆరు గంటలకు స్వాతి చనిపోయిందని చెప్పారు. దీంతో మృతురాలి బంధువులు హస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్లపై పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Latest Updates