కరోనాకు విరుగుడు పేషంట్ల రక్తమే

‘బ్లడ్ ట్రీట్ మెంట్ ’కు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

అమెరికా, చైనా సహా పలు దేశాల్లోని సైంటిస్టులు ఇప్పటికే ఈ వైరస్ కు టీకా, మందులు కనిపెట్టే పనిలోపడ్డారు. కానీ అర్జంట్ గా ఇప్పటికిప్పుడు ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే ఏం చేయాలె? కరోనా పేషెంట్ల రక్తమే దీనికి మందు అని అంటున్నారు డాక్టర్లు. అవును.. ఆల్రెడీ కరోనా వైరస్ సోకి, తగ్గిపోయిన పేషెంట్ల రక్తమే తాత్కాలిక మందు అని అమెరికా డాక్టర్లు చెప్తున్నారు. వందేండ్ల కిందట టీకాలు, ఆధునిక ఔషధాలు లేని కాలంలో ఇలా కోలుకున్న పేషెంట్ల రక్తాన్ని రోగులకు ఎక్కించడం ద్వారానే.. ఫ్లూ, మీజిల్స్, బ్యాక్టీరియల్ న్యుమోనియా వంటి రోగాలకు తాత్కాలిక చికిత్సలు చేసి, ప్రాణాలు కాపాడారని వారు అంటున్నారు. ఇటీవలి కాలంలోనూ సార్స్, ఎబోలా వంటి వైరల్ రోగాలకు ఇలాంటి ట్రీట్ మెంట్స్ మంచి ఫలితాలనే ఇచ్చాయని, ఇదే పద్ధతిని ఇప్పుడు కరోనాను తరిమేందుకూ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.

రక్తంతో ట్రీట్​మెంట్ ఎలా?

సాధారణంగా హానికరమైన వైరస్​లు, బ్యాక్టీరియా వంటివి మన శరీరంలోకి ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. అప్పటికప్పుడు సరికొత్త ప్రొటీన్ల(యాంటీబాడీస్)ను తయారు చేసి వాటిని నాశనం చేస్తుంది. ఇలా యాంటీబాడీలు సమర్థంగా ఉత్పత్తి అయి, వైరస్ లను నాశనం చేయగలిగితే, ఆ పేషెంట్లు సహజంగానే కోలుకుంటారు. అయితే, ఈ యాంటీబాడీలు ఆ పేషెంట్ల రక్తంలోని ప్లాస్మా ద్రవంలో కొన్ని నెలలు, సంవత్సరాల వరకూ ఉంటాయి. అందువల్ల ఆ పేషెంట్ల నుంచి ఈ ప్లాస్మాను సేకరించి, కరోనా పేషెంట్లకు ఎక్కిస్తే.. తాత్కాలికంగానైనా వారు కోలుకుని, ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఆర్టురో కాసడెవల్, వాషింగ్టన్ వర్సిటీ సైంటిస్టులు భావిస్తున్నారు. పేషెంట్లకు ఈ ట్రీట్​మెంట్​ చేసేందుకు అనుమతించాలంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు లేఖ కూడా రాశారు. దీంతో ఎఫ్ డీఏ ఈ పద్ధతిని అమలు చేసేందుకు మంగళవారమే ఆమోదం తెలిపింది.

For More News..

కరోనా బాధితుల కోసం రూ.1.70 లక్షల కోట్లతో మెగా ప్యాకేజీ

Latest Updates