పంజాగుట్ట నిమ్స్ లో డాక్టర్ పై దాడి

పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం రాత్రి నిఖిల్ అనే పేషంట్ ను గాయాలతో తీసుకువచ్చారు బంధువులు. ఎమర్జెన్సీ కేసు అయినా డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ చేయడం లేదని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్, వైద్య సిబ్బందిని బూతులు తిట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయలేదని…డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ అన్వేష్ పై దాడి చేశారు.  పేషంట్ తో వచ్చిన వారంతా తాగి ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డాక్టర్ పై దాడిని ఖండించారు హాస్పిటల్ సిబ్బంది.

Latest Updates