పూర్ణాహుతితో తిరుమలలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా  యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ  తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు రంగ‌నాయుకుల మండ‌పంలో వేంచేపు చేశారు. ఆ తర్వాత యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీ మలయ్పప్ప స్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

Latest Updates