కార్మికులకు కండీషన్స్ వద్దు..కేసీఆర్ కు పవన్ విజ్ఞప్తి

ఎలాంటి కండీషన్స్ లేకుండా ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో విధుల్లోకి చేర్చుకోవాలన్నారు. దీంతో ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. తర్వాత సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరారు.

కార్మికుల సమస్యల విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమ పార్టీ ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారన్నారు. 40 రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా సీఎం కేసీార్ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానన్నారు.

Latest Updates