పవన్ రీ ఎంట్రీ కంఫర్మ్ అయింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్  ను తెలుగులో రీమేక్ చేయనుండగా.. ఈ సినిమాలో హీరోగా పవన్ నటించనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. పవన్ కి 26వ సినిమా. బాలీవుడ్ లో అమితాబ్ చేసిన లాయర్ క్యారెక్టర్ లో పవన్ నటించనున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 2018లో అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన జన సేనాని.. చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

హిందీ, తమిళ్‌ లో పింక్ సినిమాను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌, తెలుగులో దిల్‌ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగులో దిల్ రాజు బ్యానర్ అంటే ఫుల్ క్రేజ్, అటు బోనీ కపూర్ తోడు కావడం, పవన్ రీ ఎంట్రీ.. ఈ కాంబో సినిమాపై అంచనాలను పెంచేశాయంటున్నారు ఫ్యాన్స్. ఓ మై ఫ్రెండ్‌, ఎంసీఏ సినిమాల ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌న్నాడు. పింక్ తమిళ్‌ రీమేక్ నేర్కొండపార్వైలో అజిత్ నటించగా.. సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest Updates