మా MLAపై ఏకపక్షంగా వ్యవహరిస్తే నేనే వస్తా

pawan-kalyan-comments-about-rapaka-varaprasad-arrested

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఏపీ ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తే తానే వస్తానని అన్నారు పవన్. ప్రజల కోరిక మేరకే వరప్రసాద్ పోలీస్టేషన్ కు వెళ్లారని పవన్ అన్నారు. అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యయమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే మలికిపురం పోలీస్టేషన్ ను ముట్టడించినందునే వరప్రసాద్ పై కేసు నమోదు చేశామని చెప్పారు పోలీసులు.

మకిలిపురం ఘటన గోటితో పోయేదని దాన్ని గొడ్డలి దాకా తెచ్చారని పవన్ అన్నారు. తమ MLA అరెస్ట్ విషయంలో జనసేన కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని చెప్పారు.   పార్టీ కార్యకర్తలు, నేతలు సంయమనం పాటించాలని పవన్ కోరారు.   నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

వరప్రసాద్ పై కేసును నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనను శాంతిభద్రతల సమస్యగా మారకుండా చూడాలని పోలీసు అధికారులకు పవన్ విజ్ఞప్తి చేశారు. మకిలిపురం ఘటనపై ఎప్పటికప్పుడు తాను పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని అన్నారు.

Latest Updates