మా వైపు నిజాయితీ పరులు..వైసీపీ వైపు దోపిడి దారులు

ఉత్తరాంధ్ర బీసీలను తెలంగాణలో ఓసీలుగా మారిస్తే వైసీపీ ఎందుకు మాట్లాడలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించన పవన్.. కేసీఆర్ అంటే జగన్ కు భయం  అందుకే వైసీపీ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టలేదన్నారు. డబ్బుతో మన జీవితాలు కొనాలనుకునే నాయకుల్ని పక్కన పెట్టేయాలని పిలుపునిచ్చారు. జనసేన  వైపు నిజాయితీ పరులుంటే..వైసీపీ వైపు దోపిడి దారులున్నారని విమర్శించారు.  అగ్రి గోల్డ్ బాధితుల ప్రతి రూపాయి తిరిగి ఇప్పిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం తన బాధ్యత అన్నారు. దేశవ్యాప్తంగా 132 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా చంద్రబాబు గానీ జగన్ గానీ నోరు మెదపలేదని విమర్శించారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి పరుస్తామని హామి ఇచ్చారు పవన్.

Latest Updates