ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనమే ఇవ్వాలి: పవన్

టీడీపీ మద్దతు విషయంలో జగన్ చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  చిత్తూరు జిల్లా మదనపల్లి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, జగన్ లపై విమర్శలు గుప్పించారు.‘జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా నేను టీడీపీకి మద్దతు ఇచ్చే వాడిని అయితే మగాడిలాగా ఇస్తా. 2014లో అలానే ఇచ్చాను. మీలా భయపడి దొడ్డి దారిలో బీజేపీ , టీఆర్ఎస్ మద్దతు కోసం చూడలేదు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నాము. మదనపల్లి నుండి కోరుకుంటున్నా జగన్ , చంద్రబాబు కూడా జనసేన కి ఓటు వేస్తే బాగుంటది. సైకిల్ పాతబడిపోయింది. ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనమే ఇవ్వాలి‘ అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

Latest Updates