చంద్రబాబుకు పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపిస్తా: పవన్

ఎన్నికల ప్రచారంలో మాటలతూటాలు పేలుస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్.. చంద్రబాబు, జగన్ లపై విమర్శలు కురిపించారు. ఎలక్షన్ అయిపోయాక జైలుకి వెళ్ళడానికి జగన్ లా అక్రమ ఆస్తుల కేసులు.. చంద్రబాబులా ఓటుకు నోటు కేసులు లేవని విమర్శించారు. మీలో నలుగురు వచ్చి తన శవాన్ని మోసే వరకు తాను జనసేనని మోయగలనని చెప్పారు. చంద్రబాబుకి పెన్షన్ ఇచ్చి రాజకీయాల నుండి విముక్తి కలిగిద్దామన్నారు. టీడీపీ, వైసీపీ పనికిమాలిన దుష్ప్రచారాలు చేస్తున్నారని..అసలు టీడీపీతో కలవాల్సిన దుస్థితి తమకు లేదన్నారు. సైకిల్ చైన్ ఎప్పుడో తెంపేశామన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే గోదావరి జిల్లాల్లో టీడీపీ నాయకులకు మర్యాద దక్కదని హెచ్చరించారు పవన్.

Latest Updates