ఏపీలో పోటీ చెయ్ :KCR రిటర్న్ గిప్ట్ పై పవన్ సవాల్

అమరావతి, వెలుగు: కేసీఆర్ చెబితే వైఎస్ ఆర్ సీపీని గెలిపించేందుకు ఆంధ్రులకు ఆత్మగౌరవం, పౌరుషం లేదా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డా రు. వైఎస్ ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఆంధ్రులను ద్రోహులని తిట్టిన కేసీఆర్ ను గెలిపించినట్టేనన్నారు. శనివారం ఆయన కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొ న్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కేసీఆర్ ఏపీకొచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ఏపీ వాళ్లు పోటీ చేయకూడదుగానీ.. వాళ్లు మాత్రం ఏపీలో రాజకీయాలు చేయొచ్చా అని ప్రశ్నించారు. బీసీలపై జగన్ కపట ప్రేమను చూపిస్తున్నారన్నారు. కనీసం అభ్యర్థులనైనా జగన్ ఏపీలో కూర్చు ని ఎంపిక చేయలేదని విమర్శించారు. సీఈవో అని చంద్రబాబు చెప్పుకుతిరగడానికి ఆంధ్రప్రదేశ్ ఏమీ కంపెనీ కాదని పవన్ మండిపడ్డారు. రాజధాని పేరు చెప్పి ప్రజలను టీడీపీ మోసం చేసిందన్నారు. జనం కష్టాన్ని అన్యాక్రాంతం కానివ్వనన్నారు. ఏపీకి శ్రామికుడిగా ఉంటానన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలకు సంబంధించి మూడు నెలలకోసారి లెక్కలు చూపిస్తానన్నారు.

ఒకవేళ తాను ఆ హామీలను పూర్తిగా మరచిపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలంటూ జనానికి పిలుపునిచ్చారు. టి కెట్ల ఆశచూపించి అభ్యర్థులను వైసీపీ పీల్చి పిప్పి చేసిందని విమర్శించారు. రాజకీయాల్లో వాజ్‌ పేయి, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుంటానని పవన్ తెలిపారు. టీడీపీ, వైసీపీకి జనసేన సమాన దూరంలో ఉందని చెప్పారు. పాలకుల తప్పులకు కేసీఆర్ ఆంధ్రులను తిడుతున్నా జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తులన్నీ తెలంగాణలో ఉండడం వల్లే కేసీఆర్ అంటే భయమన్నారు. జగన్ కు కేసులంటే భయమని, ఏపీలో ఉంటే చంద్రబాబు ఏమైనా చేస్తా రన్న భయంతోనే హైదరాబాద్ లో ఉంటున్నారని పవన్‌‌ విమర్శించారు.

Latest Updates