లాంగ్ మార్చ్..చంద్రబాబుకు పవన్ ఫోన్

ఏపీలో ఇసుక సమస్యపై ఐక్య పోరాటానికి జనసేన సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో విశాఖలో నవంబర్ 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా రాజకీయ పార్టీల అధినేతలకు  పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. ఇసుక లేక  ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటానికి కలిసి రావాలని కోరారు. అన్ని పార్టీలు కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, పీసీపీ ఉపాధ్యక్షులు తులసీ రెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ,సీపీఎం కార్యదర్శి మధు,లోక్ సత్తా అధ్యక్షలు డీవీవీఎస్ వర్మ లకు ఫోన్ చేసి లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు. దీనికి  వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.

Latest Updates