ఇకపై నా రాజకీయం చూస్తారు : పవన్ కళ్యాణ్

భీమవరం నియోజకవర్గంలో గెలుపుకోసం ఓ పార్టీ రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం గుంటూరు జిల్లాలోని పార్టీ ఆఫీస్ లో పవన్ కల్యాణ్.. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ… నియోజకవర్గంలోని వీరవాసం అనే ఒక్క మండలంలోనే దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు విలువలకు కట్టుబడి పోటీ చేశారని… ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టాయని అన్నారు.

ఇన్నాళ్లూ ఆశయాలు, సిద్ధాంతాలతో రాజకీయాలు చేశానని, ఇక ముందు వాటితోపాటుగా అసలైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో రాజకీయం చేస్తానని పవన్ అన్నారు. మార్పు తీసుకొచ్చేంత వరకు సమస్యలపై పోరాడతానని అన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడం తనకూ తెలుసని, ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీస్తానని పవన్ అన్నారు.

Latest Updates