మండలి రద్దు సవ్యమైన చర్య కాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం జరగడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసన మండలిలో నిలిచిపోతే ఏకంగా మండలి రద్దు చేయడం సహేతుకం కాదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాబివృద్దికి ఉపయోగించే అవకాశాన్ని కోల్పోయినట్లేనని ఆయన అన్నారు. శాసనమండలి రద్దు సరైన చర్య కాదన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో శాసన మండలి పునరుద్ధరించారని సీఎం జగన్ ఇప్పుడు మండలి రద్దు చేయడం సరైంది కాదని తెలిపారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మండలి రద్ద చేయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యవస్థలను తొలిగించుకుంటూ పోవడం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అసలు శాసనమండలికి ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణంలోకి తీసుకోవాలనే అలాంటి చర్యలు ఏమి తీసుకోలేదని పవన్ దుయ్యబట్టారు.

రాజ్యాంగానికి రూపొందించిన వారు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభలు ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని, అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం సరికాదని అనిపించినప్పుడు మండలిలో దానిపై చర్చ జరుగుతుందని, తప్పులు సరిచేసుకోవాలిన తెలియజేస్తుందన్నారు. పెద్దల సభలో మేథోపరమైన ఆశయం కోసం మండలి ఏర్పాటైందని పవన్ కళ్యాణ్ అన్నారు.