అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి: పవన్ కల్యాణ్

ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆఖరి శ్వాస ఉన్నంతవరకూ ప్రజల కోసం పోరాడుతానని తేల్చిచెప్పారు. ఇవాళ గుంటూరులో పర్యటిస్తున్న ఆయన..ఇక ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయడంపై స్పందించారు. ‘పర్యావరణ నిబంధనలను అతిక్రమించే ప్రదేశం ఈ భారతదేశం. నిబంధనలు అతిక్రమించే పెద్దస్థాయి వ్యక్తులయినా, చిన్నస్థాయి వ్యక్తులు అయినా అందరికీ సమానంగా న్యాయం జరగాలి. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

 

Latest Updates