కార్టూన్ పోస్ట్ చేసి జగన్ పై సెటైర్ వేసిన పవన్

ఏపీలో  వైసీపీ, జనసేన మద్య ఇసుక దుమారం రేగుతోంది. మూడు పెళ్లిళ్లు అంటూ తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన సీఎం జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకుని పరుగెడుతున్న జగన్ కార్టూన్ ను  తన ట్విట్టర్లో పోస్ట్ చేసి విమర్శలు చేశారు. సీఎం జగన్ గురించి ఢిల్లీలో కూడా ఇలాంటి అభిప్రాయమే ఉందని అన్నారు.

175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో వైసీపీనీ ప్రజలు గెలిపిస్తే..ఐదు నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి తీసేశారన్నారు. అంతేగాకుండా  70 మంది కార్మికులు ప్రాణాలు తీసుకునేలా చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. మరో ట్వీట్ లో ఏపీలో జగన్ చెడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎకానమిక్స్ టైమ్స్ రాసిన ఎడిటోరియల్ ను పవన్ పోస్ట్ చేశారు.

Latest Updates