జగన్ సరిగా పాలనందిస్తే.. నేను సినిమాలు చేసుకుంటా: పవన్

ఆరు నెలల్లోనే  వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ సరిగా పాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానన్నారు.  ఇసుక కొరతకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్  బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక సంక్షోభం వల్ల 26 మంది చనిపోవడం బాధగా ఉందన్నారు. నాయకులు బాధ్యతాయుతంగా పాలిస్తే తాను జనసేన పార్టీని పెట్టేవాడిని కాదన్నారు . ప్రభుత్వ వైఫల్యాల వల్లే  ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వం విఫలమైనట్టేనన్నారు. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకోలేక పోతే జీవిత రథ చక్రాలు ఆగిపోతాయన్నారు.

భీమవరం,గాజువాకలో ఓడినంత మాత్రానా తాము విఫలమైనట్టు కాదన్నారు పవన్. ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదన్నారు. తాను టీడీపీకి దత్తత పుత్రుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ప్రజలకు తప్ప ఎవరికీ దత్తత పుత్రుడని అన్నారు. జగన్ కు రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడే దమ్ము లేకపోయిందన్నారు. తాను తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడా కాబట్టే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు తనను నమ్మారన్నారు పవన్.

Latest Updates