వకీల్ సాబ్ టీజర్: కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. పవన్ అభిమానులను అలరించేందుకు సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ ఇంట్రడక్షన్ సీన్లతో పాటు పలు సన్నివేశాలను పొందుపరిచారు.

“అబ్జెక్షన్ యువరానర్” అంటూ కోర్టు హాల్లో తన వాదనను ప్రదర్శించడమే కాకుండా.. కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు ” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

హిందీలో విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా… అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్ వకీల్ సాబ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Updates