మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో స్పీడ్ పెంచుతున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పేశాడనుకున్న పవన్ ‘వకీల్ సాబ్’గా
రీఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సినిమాలను అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న పీకే, తర్వాత క్రిష్
డైరెక్షన్‌లో ఓ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. తాజాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవన్ నటించనున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం పూరి ‘జనగణమన’ అనే స్క్రిప్ట్‌ని మహేశ్ బాబుతో
తెరకెక్కించాలని చూశాడు. కానీ మహేశ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అదే కథను పవన్ కళ్యాణ్‌తో చేయాలని పూరి ప్లాన్
చేశాడని సమాచారం. ఆ కథలో పవన్ సీఎంగా కనిపిస్తాడట. ఈ కథకు పవన్ కళ్యాణ్ సరిగ్గా సరిపోతాడని ఎలాగైనా అతనితోనే
చేయాలని పూరి భావిస్తున్నాడట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో వీరి కాంబోలో ‘బద్రి’,‘కెమెరామెన్ గంగతో
రాంబాబు’ చిత్రాలు వచ్చాయి. ఈ వార్త నిజమైతే వీరి కాంబోలో మూడో సినిమా చూడొచ్చనమాట.

For More News..

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

గుజరాత్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్‌.. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates