నిర్భయ కేసు: పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ ఇవాళ(సోమవారం) సుప్రీంకోర్టు కొట్టేవేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ నని పవన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పటికే పవన్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్‌ వారెంట్‌లో తెలిపింది. ఘటన సమయంలో పవన్‌ మైనర్‌ అని, అతని స్కూల్‌ సర్టిఫికెట్‌లో కూడా అతడు మైనర్‌ అని చెప్పడానికి ఆధారాలున్నాయని దోషి తరపు లాయర్ ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకోలేదని ఏపీ సింగ్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పవన్‌ గుప్తా మైనర్‌ కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. డాక్యుమెంట్లన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయరాదని, పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

Latest Updates