పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు

జగన్ రెడ్డి అని తాను సంబోధిస్తే పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఏం పిలవాలో వైసీపీ నేతలే తీర్మానించాలన్నారు. కులమతాలకు అతీతంగా తాను రాజకీయం చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షించేందుకు పులివెందుల పర్యటిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కోసం కాకుండా ప్రజల కోసం పర్యటిస్తున్నట్లు పవన్ చెప్పారు. పార్టీ పాలసీలమీద మాట్లాడాలే తప్పా ..ఎవరిమీద వ్యక్తిగత విమర్శలు  చేయోద్దని సూచించారు. మన దగ్గర సమాచారం లేకపోతే సైలెంట్ గా ఉండాలే తప్పా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని పవన్ సలహా ఇచ్చారు.

Latest Updates