టాలీవుడ్ హీరోలపై పవన్ విమర్శలు

తెలుగు భాషపై టాలీవుడ్ హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చాలా మంది హీరోలు తెలుగు మాట్లాడుతారో తెలియదు గానీ రాయడం మాత్రం రాదన్నారు. తిరుపతిలో తెలుగు వైభవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. హీరోలు తెలుగు సినిమాలు చేస్తారు.. డబ్బులు సంపాదిస్తారు కానీ తెలుగు మాత్రం రాయడం రాదన్నారు. ఒక తెలుగు హీరోగా ఇవన్నీ తనను ఆవేదనకు గురి చేశాయన్నారు.తెలుగు భాషను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతామన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాండిత్యం రాను రాను దిగజారిపోతుందన్నారు. శ్రీ మేడసాని మోహన్ వంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవన్నారు. మన రచయితలకు కావ్యాలు, శాస్త్రాల గురించి తెలియవన్నారు. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్ల స్థాయికి దిగజారిపోయిందన్నారు. ఈ స్థాయికి ప్రమాణాలు దిగజారిపోయాయి కాబట్టే  రోడ్లమీద మహిళలపై అత్యచారాలు జరుగుతున్నాయన్నారు.

Latest Updates