పవన్, మాయావతి టూర్ షెడ్యూల్..

ఏపీలో ఎన్నికల ప్రచారానికి  రానున్నారు బీఎస్సీ అధినేత్రి మాయావతి. జనసేన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రెండు రోజుల పాటు ఆమె  ప్రచారం చేయనున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి (ఏప్రిల్2) విశాఖపట్నంకు చేరుకుంటారు మాయావతి. 3వ తేదీ(బుధవారం) ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రెస్ మీట్ పెడతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని అజిత్ సింగ్ నగరల్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా 4వ తేదీ(గురువారం) తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  అదే రోజు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Latest Updates