సీమ టూరుకు సిద్ధమైన పవన్

ఈ నెల 21 నుంచి రాయలసీమలో పర్యటించనున్నరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతలకు, కార్యకర్తలకు దశాదిశా నిర్దేశించనున్నారు పవన్ కల్యాణ్. యురేనియం, స్టీల్ ప్లాంట్ లను పరిశీలించనున్న జనసేనాని..కెసి కెనాల్ ను సందర్శించి ఆయుకట్టు రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీమ సాగు జలాలపై ముఖ్య నేతలతో చర్చలుంటాయని..భవిష్యత్ కార్యాచరణ పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సీమ జిల్లాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్న పవన్..మెనిపెస్టోకు అనుగుణంగా ప్రధాన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందంటున్నారు.

 

టూర్ వివరాలు ఇలా ఉన్నాయి

ఈ నెల 21, 22, 23వ తేదీల్లో కర్నూల్ జిల్లాలో

25, 26, 27వ తేదీల్లో కడప జిల్లాలో..

28, మార్చి 1, 2వ తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్.

 

Latest Updates