నేను యాక్టర్ నైతే…నువ్వు: జగన్ కు పవన్ ప్రశ్న

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను మీరు యాక్టర్‌‌‌‌‌‌‌‌ అని పిలిస్తే.. జైల్లో ఉండొచ్చిన మిమ్మల్ని ఏమని పిలవాలని వైఎస్‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ప్రశ్నిం చారు. ప్రజల సొమ్ము దోచుకుని జగన్ రెండేళ్లు జైలుకు వెళ్లారని ఆరోపించారు. నేను చంద్రబాబు పార్టనర్‌‌‌‌‌‌‌‌నైతే.. మీరు బీజేపీ పార్టనరా? అమిత్‌ షా పార్టనరా అని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాలో బుధవారం పవన్‌‌‌‌‌‌‌‌ పర్యటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి సాయం చేయా లనుకుంటే పొత్తు పెట్టుకునేవాడినని, మీలా చీకట్లో బీజేపీకి షేక్ హ్యాండిచ్చి , అమిత్ షా కాళ్లు మొక్కి,మోడీ ముందు మోక రిల్లే వాడినికాదని అన్నారు. జన సేన ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం జిల్లాలో వలసలను నివారిస్తానన్నారు. జిల్లాలో కిడ్నీ బాధితులకోసం రూ.500 కోట్లు విడుద ల చేస్తామ ని ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ వద్ద తల తెగిపడినా ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనన్నారు. బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో లోపాయికారి పొత్తు పెట్టుకుని ప్రజలను వైసీపీ మోసం చేస్తోందన్నారు.సామాజిక మార్పు కోసం స్థా పించిన ప్రజారాజ్యం పార్టీని వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీడీపీ కుట్రలు చేసి లేకుండా చేశారన్నా రు. అదే తరహాలో ఇప్పుడు జన సేనను దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందన్నా రు.మీరు పద్ధతిగా మాట్లాడి తే తానూ పద్ధతిగా మాట్లాడుతానని, మీరు తెగించి మాట్లాడి తే మార్పుకోసం వచ్చి న నేనెంత తెగిస్తానో ఊహించుకోండని హెచ్చరించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పి స్తామని పవన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ. 5 వేల పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఇస్తామన్నారు.

Latest Updates