‘నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే’

లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్ స్పందన

అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్నామని తెలుపుతూ జనసేన అధికారిక ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.

“వి.వి.లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాం. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీ నారాయణ గారు  పార్టీకి రాజీనామా చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు’’ అని పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Related News: పవన్‌లో నిలకడ లేదంటూ జనసేనకు మాజీ జేడీ రాజీనామా

Latest Updates