పేటీఎం కరో..సెల్ఫీలేలో

శ్రీకృష్ణు డి వేషధారణతో ఫొటోలకు పోజులిస్తున్న ఇతని పేరు నూకరాజు. గ్రాడ్యువేషన్ పూర్తిచేసి.. కళలపై ఉన్నమక్కువతో వివిధ గెటప్ లు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనితో మొదటి సెల్ఫీ ఉచితంగా తీసుకోవచ్చు, మరో సెల్ఫీ దిగాలంటే రూ.50 పేటీఎం చెయ్యాలి. 10 సంవత్సరాలుగా100 గెటప్స్ తో అలరిస్తున్నారు. తన వయస్సు 50 సంవత్సరాలని, సెల్ఫీలతో వచ్చే డబ్బులతో వచ్చే ఏడాది వృద్ధా శ్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నూకరాజు తెలిపారు. ఆదివారం  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇలా సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

Latest Updates