అవి చూసి రాత్రంతా ఏడ్చా!

‘ఆర్ఎక్స్ 100’తో  ఓవర్ నైట్ స్టార్‌‌‌‌డమ్ అందుకున్నాను అనుకోవడం కరెక్ట్ కాదు.. దాని వెనుక ఆరేళ్ల శ్రమ దాగుంది’ అంటోంది పాయల్ రాజ్‌‌పుత్.  అక్టోబర్ 11న ఆమె నటించిన ‘ఆర్‌‌‌‌డీఎక్స్ లవ్’  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పాయల్ చెప్పిన విశేషాలు…

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో నన్నంతా యువరాణిలా ట్రీట్ చేస్తున్నారు. ఆ సినిమా వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. అందుకే ఇందులో బోల్డ్ డైలాగ్స్, సీన్స్ ఉన్నప్పటికీ అంగీకరించాను. అయినా ఇలాంటి సినిమా నేను కాక మరెవరు చేస్తారు.. నేనేగా చేయాలి!

టీజర్ చూసి ఇంటిమేట్ సీన్స్ ఎక్కువున్నాయి అనుకుంటున్నారు. నాకైతే సోషల్ మీడియాలో పోర్న్ స్టార్ లాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అవి చూసి రాత్రంతా ఏడ్చాను. నిజానికి సినిమాలో అవి ఒక చిన్న భాగం మాత్రమే. అన్ని ఎమోషన్స్ కలగలిసిన చిత్రమిది. యాక్షన్ సీన్స్ కూడా చేశాను. డూప్‌‌ని పెడతానంటే వద్దని నేనే నటించాను. నా మోకాలు ప్రాక్చర్ అయింది

నా పాత్ర పేరు అలివేలు. తనో సామాజిక కార్యకర్త. పాపికొండ అనే ఊర్లోని సమస్యలపై పోరాడుతుంటుంది. చిత్రీకరణలో భాగంగా ఎలాంటి సౌకర్యాలు లేని ఓ చిన్న గ్రామంలో నలభై రోజులకు పైగా ఉన్నాను. ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల్లో లగ్జరీగా పెరిగిన నాకది చాలా కష్టంగా అనిపించింది. కానీ నా పాత్ర సహజంగా రావడానికి అది ఉపయోగపడింది.

మధుర్ భండార్కర్, ఇంతియాజ్ అలీ లాంటి బాలీవుడ్ డైరెక్టర్స్‌‌కి నేను ఫ్యాన్‌‌ని. రొటీన్ స్టీరియో టైప్ మూవీస్ కాకుండా డిఫరెంట్‌‌గా, బోల్డ్‌‌గా చేయడం ఇష్టం. బోల్డ్‌‌నెస్ అంటే రొమాంటిక్ సీన్స్, స్కిన్ షో కాదు.. జనం ఎదుట మాట్లాడటానికి సంశయించి, తెర వెనుక మాత్రం ఓపెన్‌‌గా మాట్లాడే విషయాలుంటాయి. అలాంటి కంటెంట్‌‌తో కూడిన చిత్రాల్లో నటించడానికి సిద్ధం.

నేనేమీ ఓవర్‌‌‌‌నైట్ స్టార్‌‌‌‌డమ్ అందుకోలేదు. దానివెనుక ఆరేళ్ల శ్రమ ఉంది. సీరియల్స్‌‌తో కెరీర్ ప్రారంభించి మూడు పంజాబీ సినిమాల్లో నటించాను. అందులో ‘సైరాట్’ రీమేక్ కూడా ఒకటి. సౌత్ సినిమాల్లో ఎంట్రీ కోసం చాలాసార్లు నేను ఆడిషన్‌‌లో పాల్గొని రిజెక్ట్‌‌ అయ్యాను. సో అంత ఈజీగా నాకీ క్రేజ్ రాలేదు.

 నన్నింకాఆర్ఎక్స్ 100’లోని ఇందు పాత్రలోనే చూస్తున్నారు. ఒకరకంగా అది గొప్పగా ఉన్నప్పటికీ నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుంది. అదే పాత్ర మళ్లీ చేయాలని లేదుఅందుకే సినిమాలు జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. ప్రస్తుతం వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తున్నాను. ఐపీఎస్ అధికారిగా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తున్నాను. ఆ పాత్రలోనూ హాట్‌‌గా కనిపిస్తాను (నవ్వుతూ). డిఫరెంట్ జానర్. మేకప్ లేకుండా కనిపిస్తా.

Latest Updates