‘ఎ రైటర్’ ఫ్యాన్స్ కు అంకితం: పాయల్ రాజ్ పుత్

న్యూఢిల్లీ: ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ యూత్ గుండెల్ని కొల్లగొట్టింది. వెంకటేశ్ సరసన వెంకీ మామ, రవితేజ పక్కన డిస్కో రాజాలో నటించి ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. లాక్ డౌన్ తో అందరు నటుల్లాగే ఖాళీగా ఉన్న పాయల్.. ఫస్ట్ టైమ్ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ‘ఎ రైటర్’ పేరుతో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ శనివారం రిలీజైంది. 16 నిమిషాల నిడివితో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేయడం విశేషం.

గృహ హింస కథాంశంతో తెరకెక్కిన రైటర్ కు పాయల్ బాయ్ ఫ్రెండ్ గా రూమర్స్ వచ్చిన సౌరభ్ ధింగ్రా డైరెక్షన్ వహించాడు. ఇందులో నటించినప్పుడు తనకు సంబంధించిన మేకప్, హెయిర్ స్టయిల్ లాంటి వాటిని పాయల్ సొంతంగా చేసుకోవడం గమనార్హం. రైటర్ పోస్టర్ ను పాయల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘కెమెరా ముందు లేకపోవడాన్ని ప్రతిరోజూ మిస్సవుతున్నా. ఎ రైటర్ ఒక కథను మాత్రమే చెప్పదు. ఆ పాత్ర జీవిస్తుంది. ఈ అందమైన షార్ట్ ఫిల్మ్ ను మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. నా ఫ్యాన్స్ అందరికీ రైటర్ ను అంకితం చేస్తున్నా’ అని పాయల్ పేర్కొంది.

Latest Updates