RDX లవ్ ట్రైలర్.. ఇది చాలా హాట్

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్న పాయల్ రాజ్ పుత్ నటించిన కొత్త సినిమా RDX లవ్. ఈ మూవీ టీజర్ విడుదలైంది.

స్టిల్స్ తో మూవీపై ఇప్పటికే ఓ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన మేకర్స్… టీజర్ తో దాన్ని కన్ ఫామ్ చేశారు. ఇది అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమా అని టీజర్ తో తేల్చేశారు. పాయల్ రాజ్ పుత్  ను చాలా హాట్ గా చూపించారు. డైలాగులు కూడా ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి.

ఆర్ఎక్స్ 100 మూవీ కథ, లవ్ స్టోరీ, కంటెంట్ బాగుండటంతోనే హిట్ అయిందని … స్కిన్ షో, హాట్ సీన్స్ తో నింపేసినంత మాత్రాన సక్సెస్ రాదంటున్నారు యూత్ ప్రేక్షకులు. సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఆర్డీఎక్స్ లవ్ కు రాధన్ సంగీతం అందించాడు. పాయల్, తేజుస్ కుంచెర్ల లీడ్ రోల్స్ పోషించారు.

 

Latest Updates