paytm షాక్ : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు

paytm-shots-hemant-stock-shoot-happend-mishra_f05279ec-1615-11e8-80b7-5f600041ef82వారం రోజులుగా paytm యూజర్లు షాక్. క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎం వాలెట్ కు ట్రాన్స్ ఫర్ అవుతున్న డబ్బులు.. గిఫ్ట్ ఓచర్లుగా మారిపోతున్నాయి. వాలెట్ లో డబ్బులు చూపించడంలేదంటూ యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.

యూజర్లకు ఎలాంటి సమాచారం లేకుండానే paytm ఫిబ్రవరి 15 నుంచి ఓ పెద్ద మార్పు చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఎవరైనా తమ క్రెడిట్ కార్డ్ నుంచి paytm వాలెట్ కు మనీ యాడ్ చేసుకుంటే అవి.. డబ్బుల రూపంలో కనిపించకపోవటం ఇబ్బంది పడుతున్న కస్టమర్లు. ఈ గిఫ్ట్ వోచర్లు కూడా పేటీఎం మాల్ మార్కెట్ ప్లేస్ ద్వారా మాత్రమే ఐటమ్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటి ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ డబ్బులు బ్యాంక్ కు లింక్ కావు.

ఇక క్రెడిట్ కార్డ్ నుంచి పేటీఎంకి ట్రాన్స్ ఫర్ అయిన డబ్బులు.. గిఫ్ట్ ఓచర్లుగా మారటమే కాదు.. అవి ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయడానికి కూడా వీలు కావం లేదు. దీంతో యూజర్లు ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మార్పు పేటీఎం స్పందించింది. ఇది కేవలం ఒక లిమిటెడ్ పీరియడ్ ట్రైల్ మాత్రమే అని తెలిపింది. మిగతా విషయాలు తెలిపేందుకు నిరాకరించింది. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేటీఎం కస్టమర్లు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు నుంచి చక్కగా పేటీఎంకి బదిలీ చేసుకుని.. వాడుకునే వారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవటంతో అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates