పేటీఎం ఫస్ట్‌: ఆన్‌ లైన్ పేమెంట్స్‌‌పై క్యాష్‌ బ్యాక్‌‌

వెలుగు: ఆన్‌ లైన్‌ పేమెంట్స్ సంస్థ పేటీఎం ‘పేటీఎం ఫస్ట్‌’ పేరుతో ఒక వినూత్న రివార్డ్స్‌ , లాయల్టీ కార్యక్రమాన్ని మంగళవారం తీసుకొచ్చింది. దీనిద్వారా ఆన్‌ లైన్ పేమెంట్స్‌‌పై క్యాష్‌ బ్యాక్‌‌లు ఇవ్వడమేగాక తన భాగస్వామ్య సంస్థల యూజర్‌‌ బేస్‌ ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం జొమాటో, గానా, ఉబర్‌‌తోపాటు ఓటీటీ ప్లాట్‌‌ఫారాలు సోనీ లివ్‌, ఎరోస్‌ నౌతో జట్టుకట్టింది. ఏడాదికి రూ.750 చెల్లించి పేటీఎం ఫస్ట్‌‌ మెంబర్‌‌షిప్ తీసుకుంటే పైన పేర్కొన్న సంస్థల సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. సినిమా టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. త్వరలో మరిన్ని కంపెనీల సేవలను పేటీఎం ఫస్ట్‌‌ ద్వారా అందిస్తామని పేటీఎం ఉన్నతాధికారి దీపక్‌‌ అబ్బాట్‌‌ వెల్లడించారు. పేటీఎం కూడా అమెజాన్‌ ప్రైమ్‌‌ వీడియో, హాట్‌‌స్టార్‌‌, జియో టీవీ మాదిరిగానే సొంత ఓటీటీ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Latest Updates