పేటీఎం మాల్ ఫ్రీడమ్ సేల్.. 10 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్

న్యూ ఢిల్లీ: ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ సంస్థ‌ పేటీఎం మాల్ ఫ్రీడమ్ సేల్ పేరుతో ఓ కొత్త‌ ‌సేల్ ను ప్రారంభించింది. ఆగస్టు 11 నుండి ఆగష్టు 17 వరకు జ‌రిగే ఈ ఫ్రీడమ్ సేల్ లో 200 కు పైగా బ్రాండ్‌లపై 10 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌న‌ట్టు తెలిపింది. చిన్న, మ‌ధ్య త‌ర‌హ ప‌రిశ్ర‌మ‌లు(ఎస్‌ఎంఇలు ), మేక్ ఇన్ ఇండియా బ్రాండ్లు, స్థానిక కళాకారులను ప్రోత్స‌హించేందుకే ఈ సేల్‌ను ప్రారంభించినట్టు తెలిపింది.

200 వేర్వేరు ఎస్‌ఎంఇలు మరియు స్టార్టప్‌లు 20 వేర్వేరు విభాగాలలో 500 కి పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. కిరణా దుకాణాలతో సహా 10,000 మందికి పైగా ఆఫ్‌లైన్ షాపు యజమానులు ఈ అమ్మకంలో పాల్గొని కస్టమర్ ఆర్డర్‌లను పూర్తి చేస్తున్నట్టు తెలిపింది.ఈ ప్లాట్‌ఫామ్‌లో మొబైల్ ఫోన్లు, యాక్స‌స‌రీస్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్ , హోమ్ అప్లియ‌న్సస్, ఫ్యాషన్, మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ విభాగాలలోని వివిధ ఉత్పత్తులపై 10% మరియు 80% మధ్య తగ్గింపును అందిస్తున్నాయని పేటీఎం మాల్ తెలిపింది. అలాగే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీలు మరియు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే వారు కనీస ఆర్డర్ 3000 రూపాయల ప్రోడ‌క్ట్ ను కొనుగోలు చేస్తే 10% అదనపు క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంద‌ని తెలిపింది

పేటీఎం మాల్ యొక్క సీఓఓ అభిషేక్ రాజన్ మాట్లాడుతూ.. “ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. పెద్ద సంఖ్యలో ఎస్.ఎమ్.ఇ లు, చేతివృత్తులవారిని మ‌రియు భారతీయ బ్రాండ్లను డిజిటల్ కామ‌ర్స్ ద్వారా శక్తివంతం చేయాలనుకుంటున్నాం. కోవిడ్ నేప‌థ్యంలో ప్రపంచ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా ఈ విధానం అమ్మకందారులకు మరియు తయారీదారులకు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరియు విస్తరించడానికి సహాయపడుతుందని అన్నారు.

Latest Updates