ఐపీఓకి పేటీఎం

న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్లలో ఫుల్‌‌గా పేరొందిన పేటీఎం మరికొన్ని నెలల్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌‌‌‌(ఐపీఓ)కి రాబోతుంది. వచ్చే 22 నుంచి 24 నెలల్లో పేటీఎం ఐపీఓ కొరకు సన్నాహాలు చేయడం ప్రారంభిస్తుందని ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. గత ఏడాది హాత్​వే నుంచి ఈ కంపెనీ 300 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. దీంతో దీని వాల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లకు అంటే రూ.1,07,530 కోట్లకు ఎగిసింది. పేటీఎంకు చెందిన పేరెంట్ కంపెనీ వన్‌‌97 కమ్యూనికేషన్స్‌‌ ఇండియాలోనే అత్యంత పాపులర్ యూనికార్న్.   సాఫ్ట్‌‌బ్యాంక్ విజన్ ఫండ్, అలీబాబా గ్రూప్‌‌కు చెందిన యాంట్ ఫైనాన్సియల్‌‌లు దీనిలో పెట్టుబడులు పెట్టాయి. పబ్లిక్ మార్కెట్‌‌లోకి ప్రవేశించే ముందు మరింత నగదును సేకరించాలనుకుంటున్నామని శర్మ చెప్పారు.

Latest Updates