భారత్‌తో మ్యాచ్‌ తర్వాతే.. భార్యా,పిల్లలకు అనుమతి

భారత్ మ్యాచ్ తర్వాతనే భార్యా, పిల్లలతో గడిపేందుకు అనుమతి ఇస్తామని పాక్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. జూన్‌ 12న ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌ చూసేందుకు తమ భార్యా, పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని పాక్‌ ఆటగాళ్లు బోర్డును అభ్యర్థించారు.

అయితే జూన్‌ 16న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్‌ ముగిశాకే  భార్యా పిల్లలను ఇంగ్డాండ్ కు పిలిపించుకోవాలని బోర్డు తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి చేయవద్దని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల్ని ప్రపంచకప్‌కు తీసుకెళ్లడానికి గతంలో పాక్‌ బోర్డు అనుమతించలేదు. కానీ భారత్‌తో మ్యాచ్‌ అయ్యాక తీసుకెళ్లొచ్చని తాజాగా చెప్పింది.

Latest Updates