పీసీబీఎల్ ప్లాంట్ చెన్నైకే

తమిళనాడు ప్రభుత్వంతో డీల్ ఖరారు

రేస్ నుంచి తెలంగాణ, ఏపీ ఔట్‌

గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌కు రూ.600 కోట్ల పెట్టుబడి

కోల్‌కతా : సంజీవ్ గోయెంకా గ్రూప్‌‌కు చెందిన ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్(పీసీబీఎల్) ప్లాంట్ ఏర్పాటు రేస్ నుంచి తెలంగాణ, ఏపీ ఔట్ అయ్యాయి. తమిళనాడులోని చెన్నై సమీపంలో పీసీబీఎల్ ప్లాంట్ ఏర్పాటుకు డీల్ ఖరారైంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు పీసీబీఎల్ కంపెనీ తమి ళనాడులో రూ.600 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ గ్రీన్‌‌ఫీల్డ్‌ ప్లాంట్ ఏర్పాటు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలతో పీసీబీఎల్ చర్చలు జరిపింది. ఈ చర్చల్లో తమిళనాడు  ప్రభుత్వంతో డీల్ ఓకే అయింది. కంపెనీ చేపట్టిన అన్ని విస్తరణ ప్రోగ్రామ్‌‌లు ట్రాక్‌‌లోనే ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కంపెనీ బెల్జియంలో తన రెండో రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్(ఆర్‌‌ అండ్ డీ) సెంటర్‌‌ను కూడా ఏర్పాటు చేసింది. కరోనా లాక్‌‌డౌన్‌‌తో కాస్త ఆలస్యమైనప్పటికీ, అన్ని విస్తరణ ప్రాజెక్ట్ లు ట్రాక్‌‌లోనే ఉన్నట్టు పీసీబీఎల్ చెప్పింది. రూ.600 కోట్ల కొత్త గ్రీన్‌‌ఫీల్డ్ ప్లాంట్ తమిళనాడులోని చెన్నైకి సమీపంలో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ప్ర స్తుతం ఫైనల్ అప్రూవల్స్ కోసం వేచి చూస్తోందని తెలిపింది. ఈ ప్లాంట్ కన్‌‌స్ట్ర క్షన్ ఈ ఆర్ధిక సంవ త్సరం ద్వితీయార్థంలో ప్రారంభం కానుందని కంపెనీ వర్గాలు వెల్ల డించాయి. దేశంలో అతిపెద్ద కార్బన్ బ్లాక్ మాన్యుఫాక్చర ర్‌‌గా పేరొందిన ఈ కంపెనీ డిమాండ్ గ్రోత్‌‌పై ఆశాభావంతో ఉంది. ఇప్పటికే గుజరాత్‌‌లోని ముంద్రా, పాలేజ్ ప్లాంట్లలో బ్రౌన్‌‌ఫీల్డ్ ప్లాంట్ల విస్తరణకు కంపెనీ రూ.300కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ముంద్రా ప్లాంట్ విస్తరణ ఇప్పటికే పూర్తయిందని, ఇదే విధంగా పాలేజ్ పూర్తి కావడానికి దగ్గర్లో ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు ప్లాంట్ల విస్తరణతో అదనంగా 80 వేల టన్నుల కెపాసిటీ పెరుగుతుందని చెప్పాయి. ఈ రెండు కాక, కంపెనీకి కేరళ లోని కోచ్చి, పశ్చిమ బెంగాల్‌ ‌లోని దుర్గాపూర్‌‌లో కూడా మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి కెపాసిటీ 5.71 లక్షల టన్నులుగా ఉంది.

కొత్త ప్లాంట్ ద్వారా అదనంగా 1.5 లక్షల టన్నుల కెపాసిటీ

తమిళనాడులో ఏర్పాటు చేసే కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ద్వారా రబ్బర్, స్పెషలైజ్డ్ కార్బన్ బ్లాక్ ప్రొడక్ట్‌ ల కెపాసిటీ మరో 1.5 లక్షల టన్నులు పెరగనుంది. బెల్జియంలోని సుశీల గోయెంకా ఇనొవేషన్ సెంటర్ తమ పొజిషన్‌‌ను మరింత  బలోపేతం చేయనుందని గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా చెప్పారు. కంపెనీకి పాలేజ్‌‌లో కూడా ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఉంది. ఈ రెండో ఆర్ అండ్ డీ సెంటర్ స్పెషాలిటీ కార్బన్ సెగ్మంట్‌‌ను మరింత పుంజుకునేలా చేయనుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఈ రెండు ఫెసిలిటీస్ కోసం మొత్తం 30 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. దీనిని మరింత పెంచి 50 మంది సైంటిస్టులకు చేర్చనున్నట్లు కంపెనీ చెప్పింది. నానో కార్బన్స్, కొత్త తరం మెటీరియల్స్  ‌పై కంపెనీ సైంటిస్ట్ లు రీసెర్చ్ చేయనున్నారు. ఆటోమోటివ్ సెక్టార్ నుంచి డిమాండ్ బాగుం దనిపీసీబీఎల్ చెప్పింది. ముఖ్యంగా టూవీలర్, ప్యాసెంజర్ కారు సెగ్మెం ట్‌‌లో డిమాండ్ బాగా వస్తున్నట్టు పేర్కొంది.

 

Latest Updates