రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం : ఉత్తమ్

pcc-chief-uttam-about-mpp-zp-chairman-elections

హైదరాబాద్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ లను ఎన్నికోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ అభ్యర్థులతో ఆయన ఇవాళ సమావేశం అయ్యారు. 21న రాజీవ్ గాంధీ వర్థంతి సభ, 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలపై చర్చించారు.

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ వేళ.. ఈవీఎంల విషయంలో అలర్ట్ గా ఉండాలని నాయకులకు సూచించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల తర్వాత 24 గంటల్లోనే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ లను ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు అఖిల పక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలుస్తామని చెప్పారాయన.

Latest Updates