వచ్చే ఎన్నికలలో వారంతా కాంగ్రెస్ వైపే.. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే

గాంధీ భవన్: రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషియే అందుకు కారణమ‌ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో ఉత్తమ్ సమావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో చాలా కష్టపడి పని చేస్తున్నారని,  గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని తెలిపారు.

2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్న ఉత్తమ్.. కేసీఆర్ పాలనపై ప్ర‌స్తుతం ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి ఆస్కారం ఇస్తోంద‌ని.. ఎన్నికలలో టిఆర్ఎస్ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందని అన్నారు. అధికార పార్టీ నేత‌లు ప్రతిపక్షాన్ని తొకేస్తున్నారని, మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఉత్త‌మ్ ఆరోపించారు. పోలీస్ లు వన్ సైడ్ గా పని చేస్తున్నారని విమ‌ర్శించారు.

డీసీసీ అధ్యక్షులు అంశాల వారిగా పోరాటాలు చేయాల‌ని, ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయి లో పోరాటానికి సిద్ధం కావాలని ఉత్త‌మ్ అన్నారు. గత ఎన్నికలలో టీఆర్ఎస్ కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని.. వాళ్లంతా త‌మ‌వైపే వస్తున్నార‌న్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని.. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేన‌ని అన్నారు.

నిరంతరం డీసీసీల‌కు అండగా అందుబాటులో ఉంటానని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కొట్లాడి.. గుర్తింపు తెచుకుందామ‌న్నారు. పార్టీని మరింత బలోపేతం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. డీసీసీల‌ కష్టానికి ఫలితం దక్కుతుందని.. రాబోయే ఎన్నికలలో మనమే గెలుస్తామ‌ని ఉత్తమ్ అన్నారు.

Latest Updates