అంబేద్కర్ ఇష్యూను జాతీయస్థాయికి తీసుకెళ్తాం : ఉత్తమ్

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ ధ్వంసం ఇష్యూను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. MPTC, ZPTC ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు గాంధీ భవన్ లో ముఖ్య నాయకులు ఇవాళ సమావేశం అయ్యారు.  ఉత్తమ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, జిల్లాల డీసీసీలు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… రాష్ట్రంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు. మంద కృష్ణ ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

“కొండ విశేశ్వర్ రెడ్డి ఇంటికి సివిల్ డ్రెస్ లో పోలీసులు వెళ్లారు. అక్రమ కేసులు పెట్టారు. కొండా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు డైరెక్ట్ గా జరిగితే బాగుండని కాంగ్రెస్ భావిస్తోంది. నామినేషన్లకు ఒకటి రెండు రోజుల ముందే అభ్యర్థులను ఖరారుచేస్తాం” అని ఉత్తమ్ చెప్పారు.

Latest Updates