దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తది

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని ఉత్త‌మ్ ఆదేశించారు. ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చెయ్యాలని, ఆ తర్వాత నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చెయ్యాల‌ని తెలిపారు.

Latest Updates