ప్ర‌భుత్వానికి విద్యార్థుల జీవితాలంటే విలువ లేదా?

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షులు వెంకట్ తో పాటు ప‌లువురు నేత‌ల అరెస్ట్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమ‌ని అన్నారు. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని, రాష్ట్రంలో నెలకొన్న విద్యా వ్యవస్థపై ప్రశ్నించే హక్కు ఎన్ఎస్‌యూఐ నేతలకు ఉందన్నారు. ప్ర‌భుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. నిర్బంధం పెంచింద‌ని అన్నారు. పరీక్షల విషయం కోర్టులో కేసు ఉండగానే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు పూనుకోవడం ప్రజా వ్యతిరేకమ‌ని అన్నారు.

ఒకవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా.. వైర‌స్ టెస్టులు మాత్రం చేయడం లేదని మండిప‌డ్డారు ఉత్త‌మ్. రోజు రోజుకు తెలంగాణ లో కరోనా విలయతాండవం చేస్తుందని.. మరణాల సంఖ్య పెరిగిపోతుందని అన్నారు. ప్ర‌భుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేవని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషెంట్ ల‌న చికిత్స కోస‌మ‌ని పీక్కు తింటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్ చేయడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. విద్యార్థుల జీవితాలు అంటే ప్ర‌భుత్వానికి విలువ లేదా అని నిల‌దీస్తూ.. వెంటనే ప్రభుత్వం పరీక్షలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. NSUI వెంకట్ తో సహా ఏ కార్యకర్తలపైనా ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచి పెట్టాలని అన్నారు.

PCC president Uttam Kumar Reddy has strongly condemned the arrest of NSUI leaders

Latest Updates