వ్య‌వ‌సాయ బిల్లుతో ధరలు పెరిగి సామాన్యులు చాలా నష్టపోతారు

PCC president uttam that agriculture bills are designed to benefit corporate companies

రైతులను తీవ్రంగా నష్టం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా వ్య‌వ‌సాయ బిల్లులు రూపొందించారని కేంద్రంపై మండిప‌డ్డారు పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్.ఈ బిల్లు వ‌ల్ల బ్లాక్ మార్కెట్ పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు చాలా నష్టపోతారని చెప్పారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఉత్త‌మ్ విమ‌ర్శించారు.

మార్కెట్ యార్డు బయట కూడా వ్యవ‌సాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులపై నియంత్రణ ఉండదని అన్నారు. ఉత్పత్తుల అమ్మకాలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, నిత్యావసర వస్తువుల స్టాక్ లో నియంత్రణ లేకుండా చేయడం లాంటి బిల్లుల వల్ల దేశంలో రైతులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని అన్నారు ఉత్త‌మ్. ఈ విషయాలపై ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ లో వరుస ఉద్యమాలను చేపట్టామని చెప్పారు. శుక్ర‌వారం మల్లికార్జున్ ఖర్గే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బిల్లులపై మాట్లాడారని అన్నారు. 28న ప్రదర్శన నిర్వహించి గవర్నర్ ను కలిసి బిల్లులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇంకా వరస కార్యక్రమాలు ఉన్నాయని వాటిని విజయవంతం చేస్తామ‌ని ఉత్త‌మ్ అన్నారు.

Latest Updates