నయీం భార్యసహా ముగ్గురిపై పీడీ యాక్ట్‌

-జైలుకెళ్లొచ్చినా రాని మార్పు

గ్యాంగ్‌స్టర్ నయీం ఖాన్ మృతిచెందినా అతనికి సంబంధించిన అక్రమాలు మాత్రం తగ్గడంలేదు. అతని పేరు అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు, బ్లాక్​మెయిల్స్‌ మళ్లీ మొదలుపెట్టారు నయీం​భార్య, ముఠా సభ్యులు. జైలుకెళ్లి శిక్ష అనుభవించినా మారకుండా మళ్లీ పాతదారిలోనే వెళ్తున్న నయీం భార్యతోపాటు మరో ముగ్గురిపై పీడీ యాక్ట్​ నమోదు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. భునవగిరి సంజీవనగర్‌కు చెందిన నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ శ్రీను(46)  సుమారు 105 కేసులలో నిందితుడని పేర్కొన్నారు. ఇతనిపై 2016లో జిల్లా కలెక్టర్​ పీడి యాక్ట్‌ నమోదు చేసి 12 నెలల పాటు జైలుకు తరలించారు. బయటకు వచ్చి మళ్లీ నేరాలను చేస్తుండడంతో మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

సంస్థాన్​నారాయణపురంలో నివసించే ఎండీ అబ్దుల్ నసీర్ (42) కూడా సుమారు 87 కేసులలో నిందితుడు. 2017లో రాచకొండ సీపి పీడి ఆక్ట్​ కింద జైలుకు పంపారు. అయినా మారకుండా కిడ్నాప్‌లు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ తాజాగా మరో 4 కేసుల్లో నిందితుడిగా మారారు. భువనగిరికి చెందిన మహ్మద్ అబ్దుల్​ ఫాహీమ్​(40)పై కూడా నమోదు చేశారు. అలాగే నయీం భార్య హసీనాబేగం అలియాస్​ నసీమా అలియాస్ దివ్య అలియాస్​ వదినమ్మ (40)పై 2006 నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కిడ్నాపింగ్, ల్యాండ్ గ్రాబింగ్, దోపిడీ లాంటి 29 కేసులలో నిందితురాలు కావడంతో 2017లో అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం మళ్లీ క్రిమినల్ యాక్టివిటీస్ మొదలు పెట్టడంతో తాజాగా నాలుగు కేసుల్లో జైలుకు పంపించారు. శిక్షలు అనుభవించినా వారి పద్ధతి మార్చుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వీరిపై సోమవారం పీడీ ఆక్ట్​ నమోదు చేశామని చెప్పారు రాచకొండ సీపీ వివరించారు.

Latest Updates